నమ్మరానట్టి వానిని నమ్మరాదు
నమ్మదగువానిని మితిమీరి నమ్మరాదు
తనదు స్నేహితు( డొక వేళ గినిసెనేని
వాడు కలగుట్టులన్నియు బయటపెట్టు
ఇది చాణక్యనీతి. అందర్నీ నమ్మకూడదు. ముందుగా ఎవర్ని నమ్మరాదో ప్రవర్తన ద్వారా తెలుసుకోవాలి. నమ్మినతర్వాత కూడా ఆ వ్యక్తిని మరీ ఎక్కువగా నమ్మరాదు. ఒకవేళ పరిస్థితులు మారి అతను మన శత్రువైతే - అప్పుడు మన లోపాలను, రహస్యాలను బయలుచేసే ప్రమాదం ఉంది.
No comments:
Post a Comment